అంచనాల మేర ఫలితాలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో వొడాఫోన్ ఐడియా రూ.7,297 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. ఇది మార్కెట్ అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. అయితే మార్చితో ముగిసిన మూడు నెలల కాలం అంటే జనవరి-మార్చి మధ్యకాలంలో కంపెనీ నికర నష్టం రూ. 6544 కోట్లతో పోలిస్తే… కాస్త పెరిగినట్లు అన్పిస్తోంది. అలాగే మార్చి త్రైమాసికంతో పోలిస్తే ఈ త్రైమాసికంలో టర్నోవర్ రూ. 10239 కోట్ల నుంచి రూ.10410 కోట్లకు చేరింది. కంపెనీ ఆదాయం గత నాలుగు త్రైమాసికాలుగా పెరుగుతూ వస్తోంది. ఒక్కో వినియోగదారుని నుంచి వచ్చే సగటు ఆదాయం (Average Revenue per User- ARPU) గత త్రైమాసికంతో పోలిస్తే రూ. 115 నుంచి రూ. 128కి పెరిగింది. టారిఫ్‌లను పెంచడమే దీనికి ప్రధాన కారణం. కస్టమర్ల సంఖ్య బాగా పడిపోతోంది. మార్చి నెలాఖరున 24.38 కోట్లుగా ఉన్న మొత్తం కస్టమర్ల సంఖ్య జూన్ నెలాఖరుకు 24.04 కోట్లకు తగ్గింది.