For Money

Business News

1న విజయ డయాగ్నోస్టిక్‌ IPO ప్రారంభం

విజయ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌.. పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) సెప్టెంబరు 1న ప్రారంభమై 3న ముగియనుంది. ఐపీఓ ధర శ్రేణిని రూ.522-రూ.531గా నిర్ణయించినట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఆఫర్‌ ద్వారా రూ.1,895 కోట్ల వరకు నిధులు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది కంపెనీ. పబ్లిక్‌ ఆఫరింగ్‌లో భాగంగా ప్రమోటర్లు, ఇతర వాటాదారులు 3.56 కోట్ల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) కింద విక్రయించనున్నారు. ఈ షేర్లు కంపెనీ ఈక్విటీ వాటాలో 35 శాతానికి సమానం.
పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా విక్రయించనున్న మొత్తం షేర్లలో సగం (50%) అర్హులైన సంస్థాగత ఇన్వెస్టర్ల (క్యూఐబీ)కు కేటాయించనున్నారు. మరో 35 శాతం రిటైల్‌ ఇన్వెస్టర్లకు, 15 శాతం సంస్థాగతేతర ఇన్వెస్టర్లకు లభిస్తాయి. ఈ ఐపీఓలో భాగంగా ఇన్వెస్టర్లు కనీసం 28 షేర్లను బిడ్‌ చేయాల్సి ఉంటుంది. అంతకుమించి దరఖాస్తు చేయాలనుకుంటే 28 గుణకాలలో చేయాల్సి ఉంటుంది.