For Money

Business News

వెహికల్స్‌ లైఫ్‌ ట్యాక్స్‌ పెంపు

వెహికల్స్‌ లైఫ్ ట్యాక్స్ పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది సోమవారం నుంచే కొత్త రేట్లు అమలులోకి వచ్చాయి. ఇప్పటివరకు రెండు శ్లాబులు మాత్రమే అమల్లో ఉండగా, ఇపుడు దీన్ని నాలుగు శ్లాబులుగా మార్చారు. ఇప్పటి వరకు రూ .10 లక్షలలోపు విలువ చేసే వాహనాలకు ఒక పన్ను , రూ .10 లక్షల విలువ దాటిన వాటికి మరో పన్ను ఉండేది. కొత్త పద్ధతి ప్రకారం… ఇంజిన్‌ కెపాసిటీని బట్టి గాక..విలువను బట్టి లైఫ్‌ ట్యాక్స్‌ ఉంటుంది. అలాగే టూవీలర్స్‌కు ఒక తరహాలు, మిగిలిన వాహనాలకు మరో తరహాలు ట్యాక్స్‌లు ఉంటాయి. గతంలో టూవీలర్స్‌ ఇంజిను సామర్థ్యం 60 సీసీ ఒక కేటగిరిగా, 60 సీసీలు మించిన వాహన కేటగిరీలు మరో కేటగిరిగా ఉండేవి. ఇపుడు వాహనం ధరను బట్టి పన్ను వేస్తారు. రూ .50 వేల విలువ దాటిన కొత్త వాహనంపై 12 శాతం పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఒకే వ్యక్తి రెండో వాహనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే గతంలో వలే 2 శాతం మొత్తాన్ని అదనంగా కట్టాలి . ఇక మూడు, నాలుగు చక్రాలు, మోటారు క్యాబ్స్, కార్లు, జీపులు, (నాన్ ట్రాన్స్‌పోర్ట్‌) కొత్త వాహనాలకు రూ .5 లక్షల లోబడి ఉన్న వాహనాలకు 13 శాతం, రూ .10 లక్షల లోపు ఉన్న వాహనాలకు 14 శాతం, రూ .20 లక్షల లోపు ఉన్న వాహనాలకు 17 శాతం , రూ.20 లక్షల పైబడి ఉన్న వాహనాలకు 18 శాతంగా లైఫ్‌ ట్యాక్స్‌ నిర్ణయించారు . అదే ట్రాన్స్‌పోర్ట్‌ వెహికల్స్‌కు సంబంధించి… వెహికల్‌ విలువ రూ.5 లక్షల లోపు వాహనాలకు 15 శాతం, రూ. 10 లక్షల లోపు ఉన్న వాహనాలకు 16 శాతం, రూ .20 లక్షలు ఉన్న వాహనాలకు 19 శాతం, రూ .20 లక్షలు దాటితే 20 శాతంగా నిర్ణయించారు.