వేదాంత నికర లాభంలో26 శాతం వృద్ధి
డిసెంబరు నెలతో ముగిసిన త్రైమాసికంలో వేదాంతా లిమిటెడ్ నికర లాభం 26 శాతం పెరిగి రూ.4,164 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ .3,299 కోట్లు. ఇదే సమయంలో కంపెనీ ఆదాయం కూడా రూ .23,621 కోట్ల నుంచి 50 శాతం పెరిగి రూ .34,674 కోట్లకు పెరిగింది. కమొడిటీ ధరలు పెరగడం , అధిక అమ్మకాల కారణంగా కంపెనీ మెరుగైన పనితీరు చూపించింది. ఆదాయం, నికరలాభం విషయంలో కంపెనీ మార్కెట్ అంచనాలను మించింది.అయితే మార్జిన్ మాత్రం 33.18 శాతం నుంచి 31.50 శాతానికి పడటం ఒక్కటే మైనస్. గత తొమ్మిది నెలల అమ్మకాలను పరిగణనలోకి తీసుకుంటే దాదాపు అన్ని వ్యాపారాలు రికార్డు స్థాయి అమ్మకాలను నమోదు చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఈ కారణంతోనే మేము మెరుగైన పనితీరును కనబర్చామని చెబుతున్నాన’ని వేదాంతా సీఈఓ సునీల్ దుగ్గల్ తెలిపారు.