లక్ష కోట్ల డాలర్ల బిల్లుకు సెనేట్ ఆమోదం
అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రవేశపెట్టిన 1.2 లక్షల కోట్ల డాలర్ల మౌలికసదుపాయాల బిల్లుకు సెనేట్ ఆమోదం తెలిపింది. బొటాబొటి మెజారిటీ ఉన్న సెనేట్లో ఈ బిల్లు చాలా ఈజీగా ఆమోదం పొందింది. దీనికి కారణంగా దాదాపు డజనుకుపైగా రిపబ్లికన్ సెనేటర్లు ఈ బిల్లుకు ఆమోదం తెలపడమే. అయితే ఇపుడు ఈ బిల్లు ప్రజా ప్రతినిధుల బిల్లు ఆమోదించాల్సి ఉంది. ఈ సభలో బిల్లు ఆమోదంపై ఇపుడు టెన్షన్ నెలకొంది. ఎందుకంటే ఈ బిల్లుపై డెమొక్రాట్లలోనే వ్యతిరేకత వ్యక్తమౌతోంది.