ఏ క్షణమైనా రష్యా ఆయిల్‌పై నిషేధం
యూరోపియన్ యూనియన్‌తో సంబంధం లేకుండా రష్యా చమురు దిగుమతులపై అమెరికా ఆంక్షలు విధించేందుకు సిద్ధమైంది. ఇవాళ అమెరికా ఈ విషయమై తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముందని బ్లూమ్‌బర్గ్ వార్తా సంస్థ పేర్కొంది. రష్యా క్రూడ్ ఆయిల్తోపాటు నేచురల్ గ్యాస్, కోల్‌పై కూడా అమెరికా ఆంక్షలు విధించే అవకాశముందని తెలుస్తోంది. రష్యా క్రూడ్‌పై అధికంగా ఆధారపడిన యూరోపియన్ దేశాలు… ఆంక్షలు విధించేందుకు జంకుతున్నాయి. వాస్తవానికి రష్యా ఆయిల్‌పై అమెరికా చాలా తక్కువ ఆధారపడుతుంది. అయితే దీనిపై అధికారికంగా వైట్ హౌస్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. అమెరికా నిర్ణయం తీసుకుంటే… ఇతర దేశాలపై దీని ప్రభావం ఉండే అవకాశముంది.
Photo Courtesy: whitehouse