For Money

Business News

శాశ్వతంగా… అప్పుల ఊబిలో

కొన్ని దశాబ్దాలైనా సరే ఎవరూ బయటకు తీయలేని విధంగా ఆంధ్రప్రదేశ్‌ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల డేటాను కాగ్‌ విడుదల చేసింది. 10 నెలల్లో రాష్ట్ర ఆదాయం రూ. 80,000 కోట్లయితే జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఏకంగా రూ. 58,703 కోట్ల రుణాలను చేసింది. పది నెలల్లో ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన జీతాలు, వేతనాల బిల్లు రూ. 34,989 కోట్లయితే కేవలం వడ్డీ కోసం రాష్ట్ర ప్రభుత్వం పది నెలల్లో రూ. 17,656 కోట్లు చెల్లించింది. గుడ్డి మెల్లగా కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రూ. 28,656 కోట్లు రావడంతో సరిపోయింది కాని… లేకుంటే మరిన్ని అప్పులు తీసుకురాక తప్పేది కాదేమో. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై యుద్దం చేసినా…పది నెలల్లో ఇచ్చింది కేవలం రూ.7,000 కోట్లే. ఈ స్థాయిలో రాష్ట్ర అప్పులు పెరిగిపోతుంటే… మున్ముందు మూలధన నిధులు ఉంటాయా? అన్న అనుమానం కల్గుతోంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మార్కెట్‌ నుంచి… ఎల్‌ఐసీ వంటి సంస్థల నుంచి తెచ్చిన అప్పులు… ప్రభుత్వ గ్యారంటీతో వివిధ కార్పొరేషన్లను ఎన్ని వేల కోట్లు అప్పులు తెచ్చారో? 12 నెలల్లో రూ. 37,029 కోట్ల రుణం తెస్తానని బడ్జెట్‌లో చెప్పి పది నెలలకే రూ. 58,669 కోట్ల అప్పు తెస్తే… ఇక బడ్జెట్‌ సమావేశాలెందుకు? దానిపై చర్చ ఎందుకు? ఆమోదం దేనికి?
చివరికి బడ్జెట్‌ను కూడా చిత్తు కాగితాలుగా మార్చేసింది ప్రభుత్వం.