నీరసించిన అమెరికా మార్కెట్లు
యూరప్ ఈక్విటీ మార్కట్లు చాలా వరకు లాభాలను కోల్పోయాయి. నామ మాత్రపు లాభంతో ముగిశాయి. యూరో స్టాక్స్ 50 సూచీ కేవలం 0.19 శాతం లాభంతో ముగిసింది.ఇక అమెరికా మార్కెట్లు కూడా నిస్తేజంగా ఉన్నాయి. డాలర్ అర శాతం దాకా నష్టపోయింది. అయితే పదేళ్ళ అమెరికా బాండ్ ఈల్డ్స్ మాత్రం రెండు శాతం పెరిగి 3.18 శాతానికి చేరాయి. దీంతో నాస్డాక్ నామమాత్రపు లాభాలకే పరిమితమైంది. ఎస్ అండ్ పీ 500 సూచీ 0.3 శాతం, డౌజోన్స్ 0.24 శాతం… నాస్డాక్ 0.03 శాతం లాభంతో ఉన్నాయి. నాస్డాక్ కొద్దిసేపటి క్రితం నష్టాల నుంచి లాభాల్లోకి వచ్చింది.