For Money

Business News

క్రాస్‌ రోడ్‌లో నాస్‌డాక్‌

అమెరికా టెక్‌ సూచీ గరిష్ఠ స్థాయి నుంచి దాదాపు 30 శాతం దాకా క్షీణించింది. దిగువ స్థాయిలో రాత్రి స్వల్ప మద్దతు లభించింది. నాస్‌డాక్‌ 0.98 శాతం లాభంతో ముగిసినా. డౌజోన్స్‌ 0.26 శాతం నష్టంతో ముగిసింది. ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ స్థిరంగా 0.25 లాభంతో ముగిసింది. అమెరికా మార్కెట్‌ ఇపుడు క్రాస్‌ రోడ్‌లో ఉంది. మార్కెట్‌ బేర్‌ ఫేజ్‌లోకి వెళతాయా.. ఇక్కడి నుంచి కోలుకుంటాయా అన్న చర్చ నడుస్తోంది. టెక్నికల్‌గా మాత్రం మార్కెట్‌ బలహీనంగా ఉందనే అంటున్నారు. ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్ల నేపథ్యంలో వృద్ధి అవకాశాలు తగ్గుతున్నాయి. ముఖ్యంగా కరోనా కారణంగా చైనా ఆర్థిక వృద్ధి తగ్గడంతో ప్రపంచ మార్కెట్లను కలవరపరస్తోంది. దీంతో అమెరికా క్రూడ్‌ ఆయిల్ 100 డాలర్ల దిగువకు పడింది. డాలర్‌ భారీ పెరగడం కూడా అక్కడి మార్కెట్లకు కాస్త ప్రతికూలంగా మారింది. అమెరికా బలం కన్నా… ఇతర ప్రధాన కరెన్సీల బలహీనత కారణంగా డాలర్ పెరుగుతోంది.