For Money

Business News

US: మూడో వారం నిరుద్యోగులు తగ్గారు

నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసే నిరుద్యోగుల సంఖ్య వరుసగా మూడో వారం కూడా తగ్గింది. గత వారంలో క్లయిముల కోసం వచ్చిన దరఖాస్తుల సంఖ్య 2,39,000 కాగా, ఈవారం మరో 16000 తగ్గి 2,23,000కి తగ్గినట్లు అమెరికా కార్మిక శాఖ వెల్లడించింది. నిరుద్యోగ శాతం 3.9 శాతం నుంచి 4 శాతం పెరిగినా… చాలా వరకు తక్కువ స్థాయిలో ఉన్నట్లే. చాలా మందికి ఉద్యోగాలు లభించడంతో… నిరుద్యోగ క్లయిములు తగ్గాయి. జవనరి 29తో ముగిసిన వారంలో 16 లక్షల మంది అమెరికన్లు నిరుద్యోగ భృతి తీసుకుంటున్నారు. ఒమైక్రాన్‌ సమయంలో కూడా కంపెనీలు ఉద్యోగులను తీసుకోవడంతో నిరుద్యోగం అదుపులోనే ఉందని అధికారులు అంటున్నారు.