For Money

Business News

మళ్ళీ కొత్త జీఎం పత్తి విత్తనాలు

జన్యుపరంగా మార్పులు చేసిన (జీఎం) పత్తి విత్తనాలను భారత్‌లో సాగు చేసేందుకు అనుమతి కోరుతూ కేంద్రానికి జర్మనీ సంస్థ బేయర్‌ దరఖాస్తు చేసుకుంది. గతంలో ఇదే విత్తనాలకు (బొల్‌గాడ్‌ II రౌండప్‌ రెడీ ఫ్లెక్స్‌-RRF) అనుమతి కోరుతూ 2016లో మోన్‌శాంటో దరఖాస్తు చేసింది. అయితే బహుజాతి పత్తి విత్తన సంస్థల పట్ల కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందంటూ… సదరు దరఖాస్తును మోన్‌శాంటో వెనక్కి తీసుకుంది. 2018లో మోన్‌శాంటోను జర్మనీ కంపెనీ బేయర్‌ టేకోవర్‌ చేసింది. ఇపుడు అదే పత్తి విత్తనాల సాగుకు అనుమతి కోసం బేయర్‌ దరఖాస్తు చేసింది. బోల్‌గాడ్‌ II RRF వెరైటీ విత్తనాల అనుమతి కోరుతూ గత డిసెంబర్‌లో బేయర్‌ దరఖాస్తు చేసినట్లు రాయిటర్‌ వార్తా సంస్థ వెల్లడించింది. ఈ వెరైటీ వల్ల పత్తి సాగు ఖర్చు భారీగా తగ్గుతుందని, మొత్తం వ్యయంలో 65 శాతం ఆదా అవుతుందని కంపెనీ అధికారులు అంటున్నారు.