52 ఏళ్ళ కనిష్ఠానికి నిరుద్యోగ భృతి క్లైమ్‌లు
ఈవారం అమెరికాలో నిరుద్యోగ భృతి క్లైముల దరఖాస్తుల సంఖ్య 52 ఏళ్ళ గరిష్ఠ స్థాయికి పడిపోయింది. బ్లూమ్‌బర్గ్ సర్వే ప్రకారం ఈవారం నిరుద్యోగ భృతి క్లయిములు 2.6 లక్షల ఉంటాయని అంచనా వేశారు. కాని ఇవాళ వెల్లడైన డేటా ప్రకారం ఈ క్లయిములు సంఖ్య 1.99 లక్షలు మాత్రం. ఈ స్థాయి భృతి కోసం క్లైమ్‌లు రావడం 1969 తరవాత ఇదే మొదటిసారి. క్లయిముల సంఖ్య భారీగా తగ్గడమంటే… పారిశ్రామిక ప్రగతి జోరుగా ఉన్నట్లే. దీంతో మార్కెట్‌లో డాలర్ మరింత బలపడింది. డాలర్ ఇండెక్స్ 96.91కి చేరింది. అంటే 97ని క్రాస్ కావడానికి సిద్ధమైందన్నమాట.