US: 40 ఏళ్ళ గరిష్ఠానికి ద్రవ్యోల్బణం
అమెరికా చరిత్రలో 1982 తరవాత తొలిసారి ద్రవ్యోల్బణం 7.5 శాతం పెరిగింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇంత వృద్ధి గత 40 ఏళ్ళలో ఎన్నడూ లేదని కార్మిక శాఖ పేర్కొంది. కరోనా తరవాత కార్మికుల కొరత, భారీ ఎత్తున ప్రభుత్వం సాయం, ఎన్నడూ లేనివిధంగా తక్కువ వడ్డీ రేట్లు… వంటి కారణాలతో వినియోగదారులు భారీగా ఖర్చు చేశారు. దీంతో ధరలు చాలా వేగంగా పెరిగినట్లు ఆర్థిక వేత్తలు అంటున్నారు. దీంతో అమెరికాలో జీతాల పెరుగుదలపై బ్రేక్ పడినట్లే. అలాగే మార్చినెలలో ఫెడరల్ రిజర్వ్ ఏకంగా 0.5 శాతం మేర వడ్డీ రేట్లను పెంచే అవకాశముంది.