US: 40 ఏళ్ళ గరిష్ఠానికి ద్రవ్యోల్బణం
అధిక ధరలతో అమెరికా ఠారెత్తిపోతోంది. మొత్తం ఆర్థిక వ్యవస్థ ఈక్వేషన్స్‌ను మార్చేస్తోంది. గత ఏడాదితో పోలిస్తే మే నెలలో వినియోగదారుల ధర సూచీ CPI 40 ఏళ్ళ గరిష్టానికి చేరింది. మే నెలలో ద్రవ్యోల్బణం 8.6శాతానికి చేరినట్లు కార్మిక శాఖ వెల్లడించింది. మార్కెట్ అంచనాలకు భిన్నంగా ద్రవ్యోల్బణం కొత్త రికార్డు సృష్టిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఇంధన ధరలు 34.6 శాతం పెరగ్గా, పెట్రోల్ ధర 49 శాతం పెరిగింది. గ్యాస్ ధరలు కూడా భారీగా పెరిగాయి. ఇక ఇంట్లో సరుకుల ధరలు 11.9 శాతం పెరగ్గా.. విద్యుత్ చార్జీలు 12 శాతం పెరిగాయి. తాజా CPI డేటాకు అన్ని మార్కెట్లు స్పందించాయి. డాలర్ ఏకంగా ఒక శాతం పెరగ్గా, క్రూడ్ రెండు శాతం దాకా తగ్గింది. బాండ్ ఈల్డ్స్ 4 శాతం పైగా పెరిగాయి. బులియన్ పరుగులు తీస్తోంది. ఈక్విటీ మార్కెట్ కుప్పకూలాయి.