For Money

Business News

హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్రం గుడ్‌బై

ప్రభుత్వ విమానాశ్రయాలను అమ్మేస్తున్న కేంద్రం.. ఇతర జాయింట్‌ వెంచర్లలో ఉన్న తన వాటాను కూడా విక్రయించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్య (పీపీపీ) నిర్వహణలోని హైదరాబాద్‌, బెంగళూరు విమానాశ్రయాల నుంచి వైదొలగాలని నిర్ణయించింది. ఈ రెండు విమానాశ్రయాల్లో కేంద్ర సంస్థ ఏఏఐకి 13 శాతం వాటా ఉంది. కేంద్ర కేబినెట్‌ ఆమోదం తరవాత వీటి నుంచి కేంద్రం బయటపడనుంది. ఆయా విమానాశ్రయాల్లో ఇపుడున్న వాటాదారులకే తన వాటాను కేంద్రం విక్రయించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. హైదరాబాద్‌ విమానాశ్రయంలో ఏఏఐతో పాటు తెలంగాణ ప్రభుత్వానికి 13 శాతం వాటా ఉంది. కేంద్రం తన 13 శాతం వాటాను విక్రయిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టు నుంచి వైదొలగే అవకాశాలు అధికంగా ఉన్నాయి.