కేంద్ర ఆర్థిక పరిస్థితే దరిద్రంగా ఉంది
తెలంగాణ రాష్ట్రంతో పోలిస్తే కేంద్ర ఆర్థిక పరిస్థితే చాలా దరిద్రంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇవాళ ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ… తలసరి ఆదాయం, జీడీపీ వృద్ధి రేటు వంటి అంశాల్లో జాతీయ రేటు కంటే తెలంగాణ చాలా ముందు ఉందని అన్నారు. రెండిటికి చాలా
తేడా ఉందని అన్నారు. దేశ తలసరి ఆదాయంలో తెలంగాణే నంబర్ వన్ స్థానంలో ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రాలకేమో కేంద్రం, ఆర్బీఐలు ఎఫ్ఆర్బీఎం అంటూ పరిమితులు పెడుతున్నారని, కేంద్రం మాత్రం ఇష్టం వచ్చినట్లు అప్పులు చేస్తోందని అన్నారు. ఇపుడు కేంద్రం చేసిన అప్పులు దేశ స్థూల
జాతీయ ఉత్పత్తి (జీడీపీ)లో 58.5 శాతం ఉందని అన్నారు. ఈ గణాంకాలు కేంద్రం, ఆర్బీఐ ఇచ్చిన గణాంకాలేనని ఆయన అన్నారు. ఇప్పటి వరకు కేంద్రం చేసిన అప్పు రూ. 156 లక్షల కోట్లని అన్నారు. రాష్ట్రాలకేమో 25 శాతం కంటే తక్కువని ఆయన విమర్శించారు.
Union Govt's financial performance is disastrous, worst than our state, CM KCR in Telangana Assembly pic.twitter.com/GBJ2hcCxay
— Chitti News (@ChittiNews) March 15, 2022