For Money

Business News

కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణ?

జాతీయ మీడియాలో మళ్ళీ కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణ హాట్‌ టాపిక్‌గా మారింది. కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ను ఇవాళ పార్టీ జాతీయ కోశాధికారిగా నియమించారు. పార్టీ నియమావళి ప్రకారం ఒకరికి ఒక పదవి అన్న సిద్ధాంతం అమల్లో ఉంది. ఆ విధింగా చూస్తే తొందర్లోనే కేబినెట్‌లో మార్పులు ఉంటాయని భావిస్తున్నారు. అమెరికాతో వాణిజ్య చర్చలు కీలక దశలో ఉండగా, పియూష్‌ గోయల్‌ను పార్టీలోకి తీసుకురావడం ఢిల్లీ వర్గాలను ఆశ్చర్య పర్చింది. అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు పార్టీ బాధ్యతలు ఇస్తారన్న వదంతులు తప్పని తేలింది. ఆమె కేబినెట్‌లోనే ఉంటారని, అయితే శాఖ మారుస్తారని బీజేపీ వర్గాలను పేర్కొంటూ కొన్ని జాతీయ మీడియా ఛానల్‌ చెబుతున్నాయి. ఇక సోషల్‌ మీడియాలో కూడా కొత్త కేబినెట్‌పై అనేక రకాల ఊహాగానాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థిక మంత్రి అశ్వని వైష్ణవ్‌ అవుతారని చాలా మంది రాస్తున్నారు. అలాగే నిర్మలా సీతారామన్‌కు విద్యా శాఖ అప్పగిస్తారన్న వదంతులు కూడా హల్‌చల్‌ అవుతున్నాయి. పార్టీ ప్రక్షాళన పూర్తి కావడంతో ఇక కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణ చేపడతారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Leave a Reply