For Money

Business News

ట్రేడింగ్‌ మోడల్‌పై అనుమానం?

మన మార్కెట్లలో CAS వచ్చిన తరవత ట్రేడింగ్‌ మోడల్‌ మారిపోయింది. క్యాష్‌ మార్కెట్‌ క్లోజైన తరవాత కూడా ధరల్లో భారీ హెచ్చు తగ్గులు ఉంటున్నాయి. ఇక ఆప్షన్స్‌ ట్రేడింగ్‌ ఓ జోక్‌లా మారింది. ఆరంభంలో ఈ ట్రెండ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఇపుడు చివరి అరగంటలో ట్రేడింగ్‌ ఓ క్రమంలో జరుగుతున్నా… మొత్తం ట్రేండింగ్‌ పద్ధతిలోనే మార్పు వస్తోంది. గత ఆరు రోజుల నుంచి ఈ ట్రెండ్‌ చూస్తుంటే… ఒక వ్యూహం అమలవుతున్నట్లు కన్పిస్తోంది. చివరల్లో మార్కెట్‌ అనూహ్యంగా పెరుగుతోంది. భారీ నష్టాలు కాస్త… స్వల్ప నష్టాలుగా మారుతున్నాయి. మరుసటి రోజు మార్కెట్‌ భారీ నష్టాలతో ప్రారంభం అవుతోంది. క్రితం రోజు భారీ షార్టింగ్‌కు పాల్పడిన వారికి మరుసటి రోజు ఓపెనింగ్‌లోనే భారీ లాభాలు వస్తున్నాయి. ఇక మిడ్‌ సెషన్‌ వరకు ఈ ట్రెండ్‌ నడుస్తోంది. తరవాత మిడ సెషన్‌ నుంచి రికవరీ వస్తోంది. నష్టాల్లో సగం నుంచి 75 శాతం రికవరీ వస్తోంది. తరవాత షరా మామూలే. వరుసగా వార రోజుల నుంచి జరుగుతున్న ఈ ట్రేడింగ్‌ ట్రెండ్‌ ఇపుడు మార్కెట్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. సెబి మాత్రం CAS పద్ధతి కొనసాగుతుందని అంటోంది. అవసరమైతే మార్పులు చేస్తామని అంటోంది. అవన్నీ అమల్లోకి వచ్చేలోగా దీన్ని ఎవరు ఆపుతారు? దీంతో చాలా మంది ఇన్వెస్టర్లు భారీగా నష్టపోతున్నారు. మార్కెట్‌కు దూరమౌతున్నారు.

Leave a Reply