జేపీ సిమెంట్ ప్లాంట్ వొద్దు.. అల్ట్రాటెక్
రూ. 1000 కోట్లతో జయప్రకాష్ అసోసియేట్స్‌కు చెందిన సిమెంట్ ప్లాంట్లను కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనను అల్ట్రాటెక్ సిమెంట్ విరమించుకుంది. ఉత్తరప్రదేశ్‌లో 30 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఈ ప్లాంట్‌తో సహా ఆరు ఇంటిగ్రేటెడ్ సిమెంట్ ప్లాంట్లు, అయిదు గ్రైండింగ్ ప్లాంట్లను అల్ట్రాటెక్ తీసుకోవాలని నిర్ణయించింది. ఈమేరకు రెండు కంపెనీల మధ్య ఒప్పందం కూడా ఉంది. ఈ ఒప్పందం ప్రకారం జూన్ 30వ తేదీకల్లా ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంది. ఈ సిమెంట్ ప్లాంట్ పర్యావరణ అనుమతి అందాల్సి ఉంది. దీంతో ఈ ప్లాంట్ డీల్ నుంచి వైదొలగుతున్నామని అంటూనే.. రూ. 620 కోట్లయితే చెల్లిస్తామని పేర్కొంది.