10 శాతం డౌన్… మళ్ళీ రికవరీ
ఇవాళ ఉదయం స్థిరంగా ప్రారంభమైన జొమాటొ షేర్ ఒకదశలో పది శాతం క్షీణించి రూ.51.75కు పడిపోయింది. ఈ షేర్ నిన్న రూ. 55.55 వద్ద ముగిసింది. ఇవాళ ఇలా పడటానికి కారణంగా కంపెనీలో తనకు ఉన్న వాటాను ఊబర్ అమ్మేసుకోవడమే. ఏకంగా 2.11 కోట్ల షేర్లు చేతులు మారినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి 30 డీల్ కుదిరాయి. మరి ఈ షేర్‌ను ఎవరు కొన్నారో ఇంకా వెల్లడి కాలేదు. జొమాటోలో ఊబర్ టెక్నాలజీస్ 7.8 శాతం వాటా ఉంది. లిస్టింగ్ ముందు ఈ షేర్లను ఊబర్ కొనుగోలు చేసింది. ఇలా ఐపీఓకు మందు షేర్లు కొన్నవారు ఏడాది వరకు అమ్మడానికి వీల్లేదు. వీరి లాక్ ఇన్ పీరియడ్ పూర్తవడంతో చాలా మంది జొమాటో నుంచి బయటపడ్డారు. ఇవాళ ఊబర్ కూడా వైదొలగింది. బ్లాక్ డీల్ సమయంంలో రూ. 51.75కు పడిన జొమాటో షేర్ తరవాత కోలుకుంది. ఇపుడు 3 శాతం నష్టంతో రూ. 54 వద్ద ట్రేడవుతోంది.