ఊబర్ డ్రైవర్లు.. ఉద్యోగులే
అమెరికా చెందిన ఊబర్ కంపెనీకి నెదర్లాండ్స్ కోర్టులో చుక్కెదురైంది. తమ దేశ కార్మిక చట్టాల ప్రకారం ఊబర్లో పనిచేసే డ్రైవర్లు.. ఉద్యోగులతో సమానమని వారికి మరిన్ని కార్మిక హక్కులు ఉండాలని నెదర్లాండ్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. తాను పనిచేస్తున్న ప్రతి దేశంలోనూ డ్రైవర్లు తమ సంస్థ ఉద్యోగులు కారని, వారు కాంట్రాక్టర్లని ఊబర్ వాదిస్తోంది. నెదర్లాండ్స్లో ముఖ్యంగా అమ్స్టర్డ్యామ్లో పనిచేసేఏ 4000 డ్రైవర్లు తమకు స్థానిక ఆటోరంగ కార్మికులు ఉన్న హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఫెడరేషన్ ఆఫ్ డచ్ ట్రేడ్ యూనియన్స్ కింద వీరు ఊబర్పై కేసు వేశారు. యూనియన్ వాదనతో ఆమ్స్టర్డ్యామ్ జిల్లా కోర్టు ఏకీభవించింది. కోర్టు ఉత్తర్వులను తాము అప్పీల్ చేస్తామని, నెదర్లాండ్స్లో తాము ఇక డ్రైవర్లను తీసుకునే ప్రతిపాదన లేదని పేర్కొంది. కోర్టు తీర్పు పట్ల తాము అసంతృప్తితో ఉన్నామని… తమ డ్రైవర్లలో మెజారిటీ మంది కాంట్రాక్టర్లుగా ఉండేందుకే ఇష్టపడుతున్నారని ఊబర్ పేర్కొంది.