2023లో ఈ రెండు షేర్లూ డబుల్?
గత కొన్ని సెషన్స్ నుంచి రెండు షేర్లు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా మిడ్‌క్యాప్ బ్యాంకింగ్ రంగం ఇటీవల బాగా రాణిస్తోంది. ఇదే రంగానికి చెందిన సౌత్ ఇండియన్ బ్యాంక్‌పై ఇన్వెస్టర్ల దృష్టి పడింది. ఎన్పీఏలు తగ్గడంతో పాటు బ్యాంక్ పనితీరు మెరుగు పడటంతో ఈ షేర్‌ను భారీ కొనుగోళ్ళ ఆసక్తి వచ్చింది. కొన్ని నెలల పాటు రూ.10 దిగువన ఉన్న ఈ షేర్ ఇపుడు రూ. 18.30 వద్ద ట్రేడవుతోంది.ఈ షేర్ బుక్ వ్యాల్యూ రూ.27.97. ఈ బ్యాంక్‌ను ప్రైవేట్ కంపెనీలు టేకోవర్ చేస్తారన్న వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. ఆ వార్తల సమయంలో ఈ షేర్ బాగా పెరిగేది. తరవాత షరా మమూలే. అయితే మొన్న ఎన్పీఏల దెబ్బకు షేర్ ధర దారుణంగా పడిపోయింది. ఇపుడు రూ. 18.30 వద్ద ఉన్న ఈ షేర్ వచ్చే ఏడాది డబుల్ అయ్యే అవకాశముందని అనలిస్టులు అంటున్నారు.
చక్కెర డిమాండ్
ఆసియా ఖండంలో అతిపెద్ద సమగ్ర చక్కెర ఫ్యాక్టరీ బజాజ్ హిందుస్థాన్ సుగర్. గతంలో రూ. 400పైన ఉన్న ఈ షేర్ ఇటీవల రూ. 10 దిగువకు వెళ్ళింది. దీనికి ప్రధాన కారణం రుణాల భారం. కొన్ని బ్యాంకులు ఇటీవల ఈ కంపెనీపై దివాలా పిటీషన్ కూడా వేశాయి. దీంతో ఆగ్రహించిన కంపెనీ అన్ని రకాల బకాయిలను చెల్లించేసింది. ఈ షేర్ రెట్టించిన ఉత్సాహంతో పెరుగుతోంది. ఇపుడు రూ. 16.8 వద్ద ఉంది. గత కొన్ని రోజుల్లోనే ఈ షేర్ ధర డబుల్ అయింది. అయితే ఈ కంపెనీ వద్ద సుగర్ ప్లాంట్‌తో పాటు ఎథనాల్ తయారీ ప్లాంట్, విద్యుత్ ప్లాంట్ కూడా ఉంది.ప్రస్తుతం ఈ షేర్ బుక్ వ్యాల్యూ రూ.17.05. ఈ షేర్ కూడా వచ్చే ఏడాది డబుల్ అవుతుందని భావిస్తున్నారు. ఈసారి సుగర్ సీజన్లో చెరకు ఉత్పత్తి తగ్గుతుందని.. దీంతో చక్కెర ధరలు పెరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఏ విధంగా చూసినా ఈ షేర్ ఇపుడు మంచి వ్యాల్యూయేషన్ వద్ద లభిస్తోందని కొందరు అనలిస్టులు అంటున్నారు.