ఈ రెండు షేర్లూ కొనండి
కొత్త ఏడాదిలో రాణించే షేర్లకు సంబంధించి అనేక బ్రోకింగ్ సంస్థలు ప్రత్యేక లిస్ట్ విడుదల చేస్తున్నాయి. అలాగే స్టాక్ మార్కెట్ అనలిస్టులు కూడా కొన్ని షేర్లను సిఫారసు చేస్తున్నారు. ఐఐఎఫ్ఎల్ డైరెక్టర్ సంజీవ్ భాసిన్ కూడా కొన్ని షేర్లను రెకమెండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈవీ రంగంలో కొన్ని షేర్లను ఆయన ప్రస్తావించారు. భారీ ఎత్తున డీజిల్ బస్సులను ఈవీలుగా మార్చుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. అలాగే ఈవీలకు పలు విడిభాగాలు తయారు చేసే కంపెనీల షేర్లు కూడా 2024లో రాణిస్తాయని భాసిన్ అంటున్నారు. ఈ విభాగంలో మారుతీ, అశోక్ లేల్యాండ్ షేర్లను ఆయన డార్క్ హార్స్లుగా పేర్కొంటున్నారు. ఇండిగో నుంచి కూడా పలు బస్సులకు ఆర్డర్లు వస్తున్నాయని… అలాగే ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ విభాగం నుంచి కూడా ఈవీలకు భారీ ఆర్డర్లు వస్తున్నాయని ఆయన చెప్పారు. ఇక కమర్షియల్ వాహనాల మార్కెట్లో టాటా మోటార్స్ బాగా రాణించే అవకాశముందని పేర్కొన్నారు. వీటిలో అశోక్ లేల్యాండ్కు ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు. హీరో, బజాజ్ ఆటోలు కూడా రాణిస్తాయని అంటూనే విడిభాగాల విభాగంలో బోష్ కంపెనీని ఆయన రెకమెండ్ చేశారు. ఇక మెటల్స్ రంగంలో ఆయన నాల్కో, టాటా స్టీల్ షేర్లను ఆయన సిఫారసు చేస్తున్నారు. దాదాపు రూ. 8000 కోట్లతో నాల్కో విస్తరించనుందని ఆయన పేర్కొన్నారు. అలాగే గత కొన్నేళ్ళుగా టాటా స్టీల్ పెద్దగా రాణించలేదని… 2024లో ఈ షేర్ రాణించే అవకాశముందని భాసిన్ చెప్పారు.