For Money

Business News

నిఫ్టి టెక్నికల్స్‌ ఏమంటున్నాయి?

నిఫ్టి ఇవాళ అయిదు రోజుల బుల్‌రన్‌కు విరామం ఇస్తూ నష్టాలతో ముగిసింది. ఇవాళ భారీగా నష్టపోయినా… దిగువ స్థాయిలో మద్దతు అందడంతో నష్టాలను 47 పాయింట్లకు పరిమితం చేసుకుంది. ఇవాళ నిఫ్టి డొజి ప్యాటర్న్‌ను చూపించింది. అంటే కచ్చిత దిశ లేని అయోమయ స్థితిలో ఉందన్నమాట. సో… సోమవారం నుంచి మార్కెట్‌ ఎలా ఉంటుందనే అంశంపై పలువురు టెక్నికల్‌ అనలిస్టులు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. కన్సాలిడేషన్‌లో మోడ్‌లో నిఫ్టి కొన్నాళ్ళు ఉండొచ్చని… అయితే దిగువస్థాయిలో కచ్చితంగా మద్దతు లభిస్తుందని అంటున్నారు. వీక్లీ చార్ట్స్‌ ప్రకారం మార్కెట్‌ లాంగ్‌ బుల్‌ రన్‌లో ఉంది.
ఏంజిల్‌ వన్‌ షేర్‌ బ్రోకింగ్‌ సంస్థ టెక్నికల్‌ అనలిస్ట్‌ అయిన రాజేష్‌ భోంస్లే ప్రకారం నిఫ్టికి తక్షణ మద్దతు 21,600 లేదా 21,500 స్థాయిలో లభించనుంది. గత వారంపు కనిష్ఠ స్థాయి 21300 వద్దకు చేరితే… నిఫ్టికి మరింత గట్టి మద్దతు లభించే అవకాశముందని భోంస్లే అంటున్నారు. ఇక ప్రతిఘటన విషయానికొస్తే నిఫ్టి 21850 లేదా 22000 వద్ద ప్రతిఘటన ఎదురు కావొచ్చని ఆయన అంటున్నారు. మార్కెట్‌ ఓవర్‌ బాట్‌ పొజిషన్‌లో ఉన్నందున.. లెవల్స్‌ను ఎప్పటికపుడు పరిశీలిస్తూ… తమ ట్రేడింగ్‌ వ్యూహాన్ని మార్చుకోవాల్సి ఉంటుందని అన్నారు.
21650 నుంచి 21750 మధ్య నిఫ్టి చాలా వరకు కదలాడే అవకాశముందని ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌కు చెందిన సీనియర్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ రూపక్‌ డే అంటున్నారు. 21750 స్థాయిని ఛేదిస్తే.. నిఫ్టి 22000లకు చేరుతుందని అన్నారు. అదే 21650 దిగువకు వెళితే 21500 స్థాయిని టచ్‌ చేయడం ఖాయమని అంటున్నారు.
ఇక రిలిగేర్‌ బ్రోకింగ్‌కు చెందిన టెక్నికల్ రీసెర్చ్‌ సీనియర వైఎస్‌ ప్రెసిడెంట్‌ అజిత్‌ మిశ్రా… ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితులను పరిశీలిస్తూ… దిగువస్థాయిలో నిఫ్టి 21500 లేదా 21300 మధ్య నిఫ్టి కన్సాలిడేషన్‌కు ఆస్కారం ఉందని అన్నారు. దిగువస్థాయిలో మద్దతు అందే పక్షంలో నిఫ్టి 22150 స్థాయిని తాకుందని అన్నారు.