For Money

Business News

ఫ్లాట్‌గా వాల్‌స్ట్రీట్‌

ఈ ఏడాది చివరి రోజున వాల్‌స్ట్రీట్ చాలా ఫ్లాట్‌గా ప్రారంభమైంది. సూచీలన్నీ గ్రీన్‌లో ఉన్నా… నామమాత్రమే. ఏక్షణమైనా రెడ్‌లోకి వెళ్ళొచ్చు. ప్రధాన మూడు సూచీల ట్రెండ్‌ ఇదే. డాలర్‌ ఇండెక్స్ ఇవాళ కాస్త బలపడింది. ఇవాళ 101పైన ట్రేడవుతోంది. పదేళ్ళ బాండ్‌ ఈల్డ్స్‌ మాత్రం 4 శాతం లోపే ఉన్నాయి. గత రెండు సెషన్‌లో క్షీణించిన క్రూడ్‌ ఆయిల్‌ ధరలు ఇపుడు స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 77.80 డాలర్ల వద్ద ఉంది. ఇక బులియన్‌ మార్కెట్‌లో కూడా లాభాల స్వీకరణ, డాలర్‌ బలం కన్పిస్తోంది. ముఖ్యంగా వెండిలో గట్టి అమ్మకాలు కన్పిస్తున్నాయి. ప్రస్తుతం ఔన్స్‌ వెండి ధర 2 శాతం తగ్గి 24 డాలర్ల లోపు ట్రేడవుతోంది.