For Money

Business News

ఈ రెండు బ్యాంకు షేర్లు కొనండి

ఈనెల 18వ తేదీ నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో బ్యాంకింగ్‌ యాక్ట్‌కు కేంద్రం సవరణ తేనుంది. ఈ సవరణ ఆమోదంతో కేంద్ర ప్రభుత్వం సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌లను ప్రైవేటీకరించనుంది. ఇప్పటికే ఈ రెండు బ్యాంకులను ప్రైవేట్‌ కంపెనీలకు అమ్మేయాలని నీతి ఆయోగ్‌, ఆర్థిక శాఖలు సిఫారసు చేశాయి. దీంతో ఈ రెండు షేర్లను కొనుగోలు చేయాల్సిందిగా అనలిస్టులు సిఫారసు చేస్తున్నారు. ముఖ్యంగా ఐఓబీ బ్యాంక్‌ను రూ. 16.90 స్టాప్‌లాస్‌తో రూ. 19 టార్గెట్‌తో కొనుగోలు చేయాలని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ మానస్‌ సిఫారసు చేస్తున్నారు.ఈ షేర్‌ నిన్న రూ. 17.45 వద్ద ముగిసింది. అలాగే సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షేరు రూ.17.20 స్టాప్‌లాస్‌తో కొనాలని ఆయన సిఫారసు చేస్తున్నారు. ఈ షేర్‌ టార్గెట్‌ రూ. 19.50గా పేర్కొంటున్నారు. నిన్న ఈ షేర్‌ రూ. 17.85 వద్ద ముగిసింది.