For Money

Business News

మస్క్‌ ఆఫర్‌పై నేడే ట్విటర్‌ నిర్ణయం

ఒక్కో షేర్‌కు 54.20 డాలర్లు ఇవ్వడం ద్వారా మొత్తం ట్విటర్‌ ఈక్విటీ కొనేందుకు టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ఆఫర్‌ ఇచ్చాడు. అధికారికంగా ఆయన కంపెనీ ఛైర్మన్‌తో పాటు మార్కెట్ నియంత్రణ సంస్థకు లేఖ రాశారు. మస్క్‌ చేసిన ఆఫర్‌పై నిర్ణయం తీసుకునేందుకు ట్విటర్‌ బోర్డు ఇవాళ సమావేశం కానుంది. మొత్తం ఈక్విటీని నగదు చెల్లించడం ద్వారా కొంటానని మస్క్‌ వెల్లడించారు. ఆ లెక్కన 4100 కోట్ల డాలర్ల (సుమారు రూ.3 లక్షల కోట్లకుపైనే)ను మస్క్‌ వాటాదారులకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆఫర్‌ను డీల్‌ చేసే పనిని గోల్డ్‌మన్‌ శాచ్స్‌, విల్సన్‌ సన్‌సిని గుడ్‌రిచ్‌ అండ్‌ రొసటికి అప్పగించినట్లు తెలుస్తోంది. మరి మస్క్‌ ఆఫర్‌ను ట్విటర్‌ బోర్డు అంగీకరిస్తుందా లేదా తిరస్కరిస్తుందా అన్నది చూడాలి. ప్రస్తుతం ట్విటర్‌ షేర్‌ 3 శాతం లాభంతో 47.17 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మస్క్‌ ప్రకటన తరవాత టెస్లా షేర్‌లో భారీ అమ్మకాల ఒత్తిడి వస్తోంది. ఆ షేర్‌ ఇపుడు 3 శాతం నష్టంతో ట్రేడవుతోంది.