For Money

Business News

అదానీ కంపెనీలో టోటల్‌కు వాటా

ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఆయిల్ అండ్ గ్యాస్ సంస్థల్లో ఒకటైన ఫ్రాన్స్‌ కంపెనీ టోట‌ల్ ఎన‌ర్జీస్ భారత్‌లో తన వ్యాపారాభివృద్ధికి అదానీతో జతకట్టనుంది. అదానీ ఎంట‌ర్‌ప్రైజెస్ లిమిటెడ్ (ఏఈఎల్‌)కు చెందిన అనుబంధ అదానీ న్యూ ఇండ‌స్ట్రీస్ లిమిటెడ్ (ఎఎన్ఐఎల్‌)లో 25 శాతం వాటా కొనుగోలు చేయాలని టోట‌ల్ ఎన‌ర్జీస్‌ నిర్ణయించింది. భార‌త్‌లో వ‌చ్చే పదేళ్ళలో 5000 కోట్ల డాల‌ర్లకు పైగా పెట్టుబ‌డుల‌ను గ్రీన్ హైడ్రోజ‌న్ ఎకోసిస్టమ్ డెవ‌ల‌ప్ చేయ‌డానికి వెచ్చించాలని టోటల్‌ భావిస్తోంది. ఇందులో కోసం అదానీ గ్రూప్‌తో కలిసి ప్రపంచంలోకెల్లా అతిపెద్ద గ్రీన్ హైడ్రోజ‌న్ ఎకోసిస్టమ్ నెలకొల్పాలని భావిస్తోంది.