కీలక రష్యా బ్యాంకులకు ‘స్విఫ్ట్’ కట్
రష్యాకు చెందిన కొన్ని కీలక బ్యాంకులకు స్విఫ్ట్ మెసేజింగ్ సౌకర్యాన్ని ఆపేస్తున్నట్లు అమెరికా, యూరోపిన్ యూనియన్ దేశాలు ప్రకటించాయి. ప్రపంచంలోని అనేక ఆర్థిక సంస్థలు, బ్యాంకుల చెల్లింపులకు ఈ స్విఫ్ట్ సౌకర్యం అనుసంధానంగా పనిచేస్తుంది. ఈ మేరకు వైట్‌హౌస్ ఒక ప్రకటన జారీ చేసింది. యూరోపియన్ కమిషన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, బ్రిటన్, కెనెడా దేశాలు రష్యా బ్యాంకులతో స్విఫ్ట్ సౌకర్యం కట్ చేసేందుకు అంగీకరించాయి. పుతిన్‌ను బలహీన పరిచేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు వైట్‌హౌస్ పేర్కొంది. దీంతో రష్యా బ్యాంకులు ఇతర దేశాల బ్యాంకులతో లావాదేవీలు జరపడం కష్టంగా మారుతుంది.