T20: పే టీఎం షేర్‌పై నజర్
ఇవాళ ఇన్వెస్టర్లందరూ పేటీఎం లిస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. దేశంలోనే అతి పెద్ద పబ్లిక్ ఆఫర్ ఇవాళ గరిష్ఠ ధరకే… ఎలాంటి ప్రీమియం లేకుండా లిస్ట్ అవుతుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. నష్టాల్లోకి జారుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. సో… చాలా మంది ఇన్వెస్టర్లు ఈ షేర్లలో యాక్షన్‌పై దృష్టి సారిస్తున్నారు. అలాగే సఫైర్ ఫుడ్స్ లిస్టింగ్ కూడా చూడండి. ఇక ఎస్కార్ట్స్, భెల్, జూబ్లియంట్ ఇండస్ట్రీస్ షేర్ల ధరలను పరిశీలించండి. క్రూడ్ ధరలు తగ్గినందున ఇండిగో పెయింట్స్, కన్సాయి నెర్లాక్, ఏషియన్ పెయింట్స్ షేర్లలో ఆసక్తి రావొచ్చు. అలాగే ఓఎన్‌జీసీ కూడా చూడండి.