For Money

Business News

SHORT TERM: హాట్‌స్టాక్స్‌

రెండు, మూడు వారాల కోసం మూడు షేర్లను సిఫారసు చేస్తున్నారు స్వస్తికా ఇన్వెస్ట్‌మెంట్‌కు చెందిన రీసెర్చి హెడ్‌ సంతోష్‌ మీనా. పది శాతం ప్రతిఫలం కోసం ఐసీసీఐసీ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయమని ఆయన సలహా ఇస్తున్నారు. మన కంట్రోల్‌ డాట్‌ కామ్‌ పాఠకుల కోసం ఆయన ఈ సిఫారసులు చేశారు. ప్రస్తుతం ఈ షేర్‌ రూ. 495.5 వద్ద ట్రేడవుతోంది. రూ. 465 స్టాప్‌లాస్‌తో రూ.545 టార్గెట్‌ కోసం కొనుగోలు చేయొచ్చని ఆయన సలహా ఇస్తున్నారు. 20 DMA పైన ఉన్న ఈ షేర్‌కు వెంటనే రూ. 530 లేదా రూ.533 వద్ద ప్రతిఘటన ఉంది. ఇది దాటితే రూ. 545ను చేరుతుంది. రెండో షేర్‌ సువేన్‌ ఫార్మాస్యూటికల్స్‌. ఈ షేర్‌ ప్రస్తుతం రూ. 621 వద్ద ట్రేడవుతోంది. రూ. 590 స్టాప్‌లాస్‌తో రూ.700 టార్గెట్‌ కోసం ఈ షేర్‌ను కొనుగోలు చేయొచ్చని సంతోష్‌ సలహా ఇస్తున్నారు. లాంగ్‌ కన్సాలిడేసన్‌ తరవాత భారీ వ్యాల్యూమ్స్‌తో ఈ షేర్‌ బ్రేకౌట్‌కు సిద్ధంగా ఉంది. అన్ని ప్రధాన చలన సగటులపైన ఈ షేర్‌ ఉంది. రూ. 590 వద్ద ఈ షేర్‌కు గట్టి మద్దతు ఉంది. దీని దిగువకు వెళితే మాత్రం రూ. 550ని తాకొచ్చు. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్‌ను కూడా రూ. 124 టార్గెట్‌తో కొనుగోలు చేయొచ్చు. ఈ షేర్‌ ప్రస్తుతం రూ. 111.5 వద్ద ఉంది. రూ. 105 స్టాప్‌లాస్‌తో ఈ షేర్‌లో పొజిషన్‌ తీసుకోవచ్చు. ఈ షేర్‌కు రూ. 108 లేదా రూ. 105 వద్ద గట్టి మద్దతు ఉంది. ఈ మూడు షేర్లు తమ టార్గెట్‌ను రెండు లేదా మూడు వారాల్లో చేరుకునే అవకాశముంది.