ముగ్గురికి ఆర్థిక శాస్త్రంలో నోబెల్
ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురికి నోబెల్ పురస్కారం లభించింది. ఆర్థిక వేత్తలు డేవిడ్ కార్డ్ జొషువ ఆగ్రిస్ట్, గుడూ ఇంబన్స్‌కు ఈ ఏడాది పురస్కారం దక్కింది. ఆర్థిక విధానాలపై సాధారణ ప్రభావాలను అర్థం చేసుకునేందుకు వీరు సహజ ప్రయోగాలు చేశారని నోబెల్ కమిటి ప్రశంసించింది. ఆర్థిక విధానాల ప్రభావం తెలుసుకునేందుకు నిజ జీవితంలో సహజ ప్రయోగాలను చేసే తెలుసుకోవడం పరిశోధనల్లో విప్లవాత్మకమైనదని కమిటీ పేర్కొంది. కెనెడాకు చెందిన ఆర్థిక వేత్త కార్డ్ అమెరికాలో కనీస వేతనం పెంపుపై 1990 ఆరంభంలో ఇలాంటి ప్రయోగాలు చేశారు. ఈసారి ప్రైజ్‌మనీలో సగం డేవిడ్ కార్డ్‌కు మిగతా సగాన్ని జోషువ, గైడోలు పంచుకోనున్నట్లు నోబెల్ కమిటీ ప్రకటించింది.