For Money

Business News

జీతాలు 10శాతం పెరగొచ్చు

ఈ ఏడాది ఉద్యోగుల సగటు వేతన పెంపు 9.9 శాతంగా ఉండవచ్చని అంతర్జాతీయ వృత్తినిపుణుల సంస్థ అయాన్‌ వెల్లడించింది. 2016 తర్వాత ఈ స్థాయిలో జీతాలు పెరగడం ఇదే మొదటిసారి అని సంస్థ తన తన 26వ వార్షిక సర్వే నివేదికలో అంచనా వేసింది. గత ఏడాది దేశంలో సగటు వేతన పెంపు 9.3 శాతంగా ఉందని తెలిపింది. ఈ అధ్యయనంలో భాగంగా దేశంలోని 40కి పైగా విభాగాలకు చెందిన 1,500 కంపెనీల నుంచి సేకరించిన డేటాను విశ్లేషించాక ఈ నివేదికను తయారు చేసినట్లు అయాన్‌ పేర్కొంది. ఈ ఏడాది ఈ-కామర్స్‌, వెంచర్‌ క్యాపిటల్‌, హైటెక్నాలజీ/ఐటీ, ఐటీ ఆధారిత సేవలు(ఐటీఈఎస్‌), లైఫ్‌ సైన్సెస్‌ ఇండస్ట్రీలకు చెందిన ఉద్యోగుల వేతనాల్లో పెంపు అధికంగా ఉండొచ్చని పేర్కొంది. అలాగే ఈ సంవత్సరం భారత ఉద్యోగుల సగటు వేతన పెంపు 9 శాతంగా ఉండవచ్చని మరో సంస్థ మెర్సర్‌ అంచనా వేసింది.