బడ్జెట్‌కు ముందు కరెక్షన్
2023-24 బడ్జెట్‌కు ముందు మార్కెట్‌లో కరెక్షన్ వచ్చే అవకాశముందని ఐఐఎఫ్‌ఎల్ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ భాసిన్ అన్నారు. బిజినెస్ టుడేతో ఆయన మాట్లాడుతూ మార్కెట్ గరిష్ఠస్థాయిలో ఉందని.. ఇన్వెస్టర్లు చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. మార్కెట్ కొంచెం కూల్ అయ్యే వరకు వెయిట్ చేయాలని అన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు భారీగా పెరిగాయని… ప్రస్తుత స్థాయిలో కొనుగోలు చేయడం రిస్క్‌తో కూడుకున్నదని ఆయన అన్నారు. ఎన్నికల ముందు వచ్చేది ఏడాది ప్రభుత్వాలు క్యాపిటల్ ఇన్వెస్ట్ మెంట్ పెంచుతాయని మార్కెట్ భావిస్తోంది. ముఖ్యంగా స్టీల్, సిమెంట్ షేర్లలో మరింత ర్యాలీ రావొచ్చని అంటున్నారు. కెన్ ఫిన్ హోమ్స్ షేర్‌ను ఆయన ప్రస్తుత పరిస్థితుల్లో కొనుగోలు చేయొచ్చని ఆయన సలహా ఇచ్చారు. బాష్, మదర్సన్ షేర్లు కూడా మంచి ప్రతిఫలం ఇస్తాయని ఆయన చెప్పారు. అలాగే సిమెంట్ రంగంలో గుజరాత్ అంబుజా, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు రాణించే అవకాశముందని ఆయన అన్నారు. ఇన్వెస్టర్లు చిన్న చిన్న షేర్ల నుంచి బయటకు రావాలన్నారు. తమ పెట్టుబడిలో 50 శాతం మొత్తాన్ని లార్జ్ క్యాప్ షేర్లలో పెట్టాలని ఆయన సలహా ఇచ్చారు. ఆయన పూర్తి ఇంటర్వ్యూ దిగువన వినొచ్చు.