For Money

Business News

18400 దిగువన నిఫ్టి

సింగపూర్‌ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి భారీ నష్టాలతో ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే నిఫ్టి 18370ని తాకింది. ఇపుడు 18380 పాయింట్ల ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 115 పాయింట్లు నష్టపోయింది. మార్కెట్‌ను ప్రధానంగా ఐటీ షేర్లు ప్రభావితం చేస్తోంది. ఈ సూచీ ఓపెనింగ్‌లోనే ఒకటిన్నర శాతంపైగా నష్టపోయింది. అలాగే బ్యాంకు నుంచి కూడా ఒత్తిడి పెరుగుతోంది. నిఫ్టికి ఇపుడు 18380 అత్యంత కీలకంగా మారింది. తుదపరి మద్దతు స్థాయి 18338. నిఫ్టి గనుక 18400 దిగువన క్లోజైతే మార్కెట్‌ దిశ మారినట్లే భావించాలని. సో… క్లోజింగ్‌ లోపల మార్కెట్‌ కోలుకుంటుందో చూడాలి. నిఫ్టి నెక్ట్స్‌, నిఫ్టి మిడ్‌ క్యాప్‌ సూచీలు అర శాతంపైగా నష్టంతో ట్రేడవుతోంది. ఇపుడు మార్కెట్‌ దృష్టి అంతా ఐటీ షేర్లపైనే. ఐటీ రంగం పూర్తిగా బేర్‌ ఫేజ్‌లో వెళిపోతోందా అన్న చర్చ జరుగుతోంది. ఇన్ఫోసిస్‌తో నిఫ్టి టాప్‌ లూజర్‌గా నిలిచింది. అనేక ఎన్‌బీఎఫ్‌సీ సంస్థల షేర్లలో ఒత్తిడి బాగా పెరుగుతోంది. బజాజ్‌ ట్విన్స్‌ పతనమే దీనికి కారణం. ఒక్క నెలలోనే క్రూడ్‌ ధరలు 25 శాతం తగ్గినా పెయింట్‌ షేర్లు పడుతుండటం చూస్తుంటే… క్షేత్రస్థాయిలో ఈ కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్పష్టమౌతోంది.