For Money

Business News

అతి పెద్ద మాల్‌ బెంగళూరులో

ఏకంగా 12 లక్షల చదరపు అడుగులతో ఓ మాల్‌ను నిర్మిస్తున్నట్లు ఫినిక్స్‌ మిల్స్ వెల్లడించింది. దేశంలో ఇది అతి పెద్ద మాల్‌ అని, ఇతర పెద్ద మాల్స్‌తో పోటీ పడేలా దీని నిర్మాణం ఉంటుందని పేర్కొంది. దీనితో పాటు నాలుగు మాల్స్‌ను నిర్మిస్తున్నామని… ఇవన్నీ 2025కల్లా పూర్తవుతాయని ఫినిక్స్‌ మిల్స్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శిషిర్‌ శ్రీవాస్తవ తెలిపారు. వీటి కోసం మొత్తం రూ.5300 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు ఆయన వెల్లడించారు. మాల్‌ ఆఫ్‌ ఏషియా పేరుతో నిర్మిస్తున్న బెంగళూరు మాల్ 2024కల్లా సిద్ధమౌతుందన్నారు. ఇక ఇండోర్‌లో ఫినిక్స్‌ సిటాడెల్‌, అహ్మదాబాద్‌లో ఫినిక్స్‌ పల్లాడియం పేరుతో రెండు మాల్స్‌ నిర్మిస్తున్నామని… ఇవి వచ్చే ఏడాదికల్లా రెడీ అవుతాయన్నారు. మరో మాల్‌ పుణెలో ఫినిక్స్‌ మిలీనియం పేరుతో నిర్మిస్తున్నట్లు చెప్పారు.ఇక అయిదు మాల్ కోల్‌కతాలో నిర్మిస్తున్నామని… ఇది 2025కల్లా పూర్తవుతుందని శ్రీవాస్తవ చెప్పారు. ఈప్రాజెక్టులపై తమ కంపెనీ ఇప్పటికే రూ.3000 కోట్లు ఖర్చు పెట్టిందని అన్నారు. ప్రస్తుతం ఫినిక్స్‌ మిల్స్‌కు ఆరు నగరాల్లో రీటైల్‌ మాల్స్‌ ఉన్నాయి.