For Money

Business News

ఇండియా వొద్దు… ఇండోనేషియా ముద్దు

మొత్తానికి భారత్‌లో టెస్లా ప్లాంట్‌ ఏర్పాటు చేసే ప్రతిపాదనను టెస్లా విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో బ్యాటరీ, కార్ల తయారీదారులకు ఇండోనేషియా భారీ రాయితీలను, ప్రోత్సాహకాలను ప్రకటించింది. అనేక అంతర్జాతీయ కంపెనీలు ఆ దేశంలో కొత్తగా ప్లాంట్లు పెడుతున్నాయి. తాజాగా టెస్లా కూడా ఇండోనేషియాలో ప్లాంట్‌ ఏర్పాటుకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ఇవాళ ఇండోనేషియా అధినేత జాకో విడొడొతో భేటీ కానున్నారు. అలాగే ప్లాంట్ ఏర్పాటు కోసం ఆ దేశం ఆఫర్‌ చేసిన వివిధ ప్రాంతాలను మస్క్‌ స్వయంగా పరిశీలించనున్నారు. ఎలక్ట్రిక్‌ కార్లకు బ్యాటరీలు చాలా ముఖ్యం. బ్యాటరీలలో వినియోగించే నికెల్‌ ఇండోనేషియాలో సమృద్ధిగా ఉంది. చూస్తుంటే టెస్లా ప్లాంట్ ఇండోనేషియాలోనే ఏర్పాటు అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.