17000 దిశగా నిఫ్టి
నిఫ్టి డెయిలీ చార్ట్స్‌పై పటిష్ఠమైన బుల్లిష్ క్యాండిల్ ఏర్పడింది. గత వారం ప్రారంభమై రివర్సల్ 15700-16400 ప్రతిఘటన స్థాయిని దాటేసింది. ఇపుడు 17000 దిశగా నిఫ్టి పయనం ప్రారంభమైందని టెక్నికల్ అనలిస్టులు అంటున్నారు. ఇక నుంచి ట్రేడర్లు 16400ను మద్దతు స్థాయిగా చేసుకుని ట్రేడ్ చేయడం మంచిదని సలహా ఇస్తున్నారు.
ఇక ఎఫ్ అండ్ ఓ విభాగంలో ట్రేడింగ్ ట్రెండ్‌ను గమనిస్తే… కాల్ వైపు మొగ్గు కన్పిస్తోంది. నిఫ్టి 17000 జూన్ కాంట్రాక్ట్‌లో ఓపెన్ ఇంటెరెస్ట్ భారీగా పెరిగింది. అదే సమయంలో 16700 కాంట్రాక్ట్‌లో కూడా ఓపెన్ ఇంటరెస్ట్ బాగా పెరిగింది. ఇక పుట్ వైపు చూస్తే 16300 కాంట్రాక్ట్‌లో ఓపెన్ ఇంటెరెస్ట్ అధికంగా ఉంది. అలాగే 16500 వద్ద కూడా మద్దతు బాగా ఉంది. ఒకవిధంగా ఈ శ్రేణిని మద్దతు స్థాయిగా భావించవచ్చు.