వాల్‌స్ట్రీట్‌కు టెక్ జోష్
టెక్నాలజీ కంపెనీ ఇచ్చిన అండతో రాత్రి నాస్డాక్, ఎస్ అండ్ పీ 500 సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. చాలా రోజుల తరవాత మెటా ప్లాట్‌ఫామ్స్ (ఫేస్బుక్) 5 శాతం పెరిగింది. మైక్రోసాఫ్ట్ ఆరు శాతంకన్నా అధిక లాభంతో ముగిసింది. ఎస్ అండ్ పీ 500 సూచీలోని అన్ని 11 రంగాల సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. రియల్ ఎస్టేట్ సూచీ 2.45 శాతం పెరిగింది. బాండ్ ఈల్డ్స్ తగ్గడం కూడా మార్కెట్లో ర్యాలీకి కారణం. డౌజోన్స్ కూడా 0.86 శాతం పెరగడానికి కారణం ఎకానమీ షేర్లలో కూడా ఆసక్తి రావడమే. డాలర్ బలహీనపడటం ఈక్విటీ మార్కెట్లకు కలసొచ్చింది. డాలర్ ఇండెక్స్ మళ్ళీ 96 దిగువకు వచ్చేసింది. డాలర్ బలహీనపడటంతో క్రూడ్ ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ 91.43 డాలర్ల ప్రాంతంలో ట్రేడవుతోంది. భారీ లాభాలతో తరవాత బులియన్ కాస్త డల్‌గా ఉంది.