TCS: ఫలితాలు పర్లేదు, బైబ్యాక్‌కు ఓకే
డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో టీసీఎస్ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. రెవెన్యూ అంచనాల మేరకు ఉన్నా… నికర లాభం మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. ఇక గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 12 శాతం పెరిగి రూ. 9,769 కోట్లకు చేరింది. ఆదాయం కూడా 16 శాతం పెరిగి రూ. 48,885 కోట్లకు చేరింది. సీఎన్‌బీసీ టీవీ18 పోల్ మేరకు అనలిస్టులు రూ. 48,481 కోట్ల ఆదయాంపై రరూ. 9,862 కోట్ల నికర లాభం వస్తుందని అంచనా వేశారు.ఎబిటాతోపాటు మార్జిన్ కూడా స్వల్పంగా తగ్గింది. మార్జిన్ 25.7 వాతం ఉంటుదని అంచనా వేయగా, 25 శాతానికే పరిమితమైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మూడో ఇంటరిం డివిడెండ్‌ను ప్రకటించింది. షేర్‌కు రూ. 7 చొప్పున చెల్లించనుంది. రికార్డ్ డేట్ జనవరి 10. ఇక ఒక్కో షేర్‌ను రూ. 4,500 చొప్పున రూ.18,000 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్ చేయాలని కంపెనీ బోర్డు నిర్ణయించింది. క్రితం ముగింపుతో పోలిస్తే బైబ్యాక్ ధర రూ. 16.67 శాతం ఎక్కువ.