అలరించిన ఫలితాలు
జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో టాటా స్టీల్ పనితీరు మార్కెట్ వర్గాల అంచనాలను అధిగమించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ.7199 కోట్ల నికర లాభం ఆర్జిస్తుందని మార్కెట్ అంచనా వేయగా.. కంపెనీ రూ.7765 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కంపెనీ నికర లాభం 12.8 శాతం తగ్గడం విశేషం. కంపెనీ టర్నోవర్ కూడా మార్కెట్ అంచనాలను దాటి గత ఏడాదితో పోలిస్తే 18.6 శాతం పెరిగి రూ. 63,430 కోట్లకు చేరింది. ఈ త్రైమాసికంలోనే ప్రభుత్వం స్టీల్ ఎగుమతులపై 15 శాతం సుంకాన్ని విధించింది. కళింగనగర్ ప్లాంట్ అభివృద్ధి కోసం రూ. 2725 కోట్లు ఖర్చు పెట్టినట్లు కంపెనీ పేర్కొంది. జూన్ నెలాఖరుకు కంపెనీ రుణాలు రూ.54,504 కోట్లకు చేరినట్లు కంపెనీ వెల్లడించింది. ఒక్కో షేర్‌ను పది షేర్లుగా విభజించాలన్న ప్రతిపాదనకు బోర్డు ఆమోదించింది.