నికర లాభం 92 శాతం తగ్గినా…
జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో టాటా స్టీల్ రూ. 634 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ. 7,765 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. కంపెనీ నికర లాభం 92 శాతం తగ్గినా… మార్కెట్ అంచనాలను కంపెనీ అధిగమించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ. 162 కోట్ల నికర లాభాన్ని కంపెనీ ప్రకటిస్తుందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేశారు. బ్రిటీష్ పెన్షన్ స్కీమ్ లావాదేవీకి సంబంధించి ట్యాక్స్ నిబంధనల్లో వచ్చిన మార్పు కారణంగా కంపెనీ నికర లాభం భారీగా తగ్గింది. కంపెనీ ఆదాయం కూడా మార్కెట్ అంచనాలను దాటి రూ. 59,489 కోట్లకు చేరింది. ఎబిటా మార్జిన్ కూడా రూ. 6,122 కోట్లకు పెరిగింది. కంపెనీ నికర లాభాల మార్జిన్ (రూ. 8.7 శాతం)లో మాత్రం మార్పు లేదు. కంపెనీ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ అయిన నరేంద్రన్గా మరో అయిదేళ్ళ పాటు కొనసాగించేందుకు కంపెనీ బోర్డు ఆమోదించింది.