‘టాటా న్యూ’ యాప్ వచ్చేసింది
ఒకే యాప్‌లో తమ గ్రూప్‌నకు చెందిన కంపెనీల వస్తువులు, సేవలు అందుబాటులో వచ్చేలా టాటా సన్స్ అభివృద్ధి చేసిన సూపర్ యాప్.. టాటా న్యూ (Tata Neu) ఇవాళ ప్రారంభమైంది. టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖర్ సూపర్ యాప్‌ను ప్రారంభించారు. టాటా సన్స్‌కు చెందిన టాటా డిజిటల్.. ఈ యాప్‌ను అభివృద్ధి చేసింది. ఈ యాప్‌తో కస్టమర్ల జీవనం హాయిగా సాగిపోయేలా చేయడమే తమ లక్ష్యం అని చంద్రశేఖరన్ వ్యాఖ్యానించారు. అమెజాన్‌కు పోటీగా ఈ యాప్ వస్తున్న మార్కెట్ వర్గాలు అంటున్నాయి. టాటా గ్రూప్ సంస్థలు క్రోమా, వెస్ట్‌సైడ్ ఫ్యాషన్, ఎయిర్ ఏషియా ఇండియా, తాజ్ హోటల్స్, బిగ్ బాస్కెట్, ఇండియన్ హోటల్స్, కుమిన్స్, స్టార్‌బక్స్, టాటా వన్ఎంజీ, టాటా ప్లే కంపెనీల వస్తువులు/ సేవలు ఈ యాప్ ద్వారా ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. మున్ముందు టాటా మోటార్స్, విస్తారా, ఎయిరిండియా, తనిష్క్, టైటాన్ కంపెనీల బ్రాండ్లను కూడా ఈ యాప్‌లో అందిస్తారు. మరి ఇతర గ్రూప్ కంపెనీల వస్తువులు లేదా సేవలు ఆఫర్ చేస్తారా అన్నది తెలియదు.