For Money

Business News

విస్కీపై సుంకం సగానికి తగ్గింపు

బ్రిటన్‌, భారత్‌ మధ్య కుదిరిన ఒప్పందం కారణంగా బ్రిటన్‌ నుంచి దిగుమతి అయ్యే స్కాచ్‌ విస్కీపై సుంకాన్ని సగానికి తగ్గించారు. ప్రస్తుతం 150 శాతం విధిస్తుండగా, దీన్ని 75 శాతానికి తగ్గించారు. పదవ సంవత్సరానికల్లా ఈ సుంకాన్ని 40 శాతానికి తగ్గిస్తారు.దీంతో బ్రిటన్‌ నుంచి విస్కీ దిగుమతి చేసుకునే కంపెనీలు బాగా లబ్ది పొందుతాయి. ప్రస్తుతం ప్రపంచంలోనే అతి పెద్ద విస్కీ మార్కెట్‌ భారతే. దీంతో దేశీయ కంపెనీల మధ్య పోటీ బాగా పెరిగే అవకాశముంది. దీనితో పాటు కాస్మొటిక్స్‌, గొర్రె మాంసం, సాల్మన్‌ చేపలు, సాఫ్ట్‌ డ్రింక్స్‌, చాక్లొట్‌, బిస్కట్స్‌పై కూడా సుంకాలు తగ్గనున్నాయి.

Leave a Reply