For Money

Business News

చర్చలు నిజమే…

తమ బ్యాంక్‌లో వాటా కోసం జపాన్‌కు చెందిన సుమితొమొ మిత్సుయి బ్యాంకింగ్‌ కార్పొరేషన్‌ (SMBC) చర్చలు జరుపుతున్న మాట నిజమేనని ఎస్‌ బ్యాంక్‌ వెల్లడించింది. అయితే చర్చలు ఇంకా ప్రాథమిక దశలో ఉన్నందున… దీని గురించి స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలపలేదని వెల్లడించింది. ఎస్‌ బ్యాంక్‌లో SMBC 51 శాతం వాటా కోసం ప్రయత్నిస్తోందని, ఆర్బీఐ నుంచి ఈ మేరకు ఆమోదం కూడా వచ్చిందని మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. గత వారం ఎస్‌ బ్యాంకులో ప్రధాన వాటాదారు అయిన ఎస్‌బీఐతో SMBC ప్రతినిధులు ముంబైలో చర్చలు జరిపారు. ఈ బ్యాంక్‌లో SMBC 51 శాతం వాటా తీసుకునే పక్షంలో ఓపెన్ ఆఫర్‌ చేయాల్సి ఉంటుంది. ఈ బ్యాంక్‌లో మొత్తం 74 శాతం వాటా తీసుకునే ఛాన్స్‌ ఉందని తెలుస్తోంది. అంటే ఎస్బీఐతో సహా బ్యాంకులు తమ వాటాలలో కొంత SMBCకు విక్రయించాల్సి ఉంటుంది. ఈ వార్తలతో ఎస్‌బ్యాంక్ షేర్‌ ఉదయం పది శాతం లాభంలో ఓపెనైంది. అయితే ఎస్‌ బ్యాంక్‌ క్లోజింగ్‌కల్లా కేవలం ఒక శాతం లాభంతో ముగిసింది.