ఇన్‌స్టామార్ట్‌లో రూ.5,250 కోట్లు పెడతాం
నిత్యావసరాలను వేగంగా సరఫరా చేసే తమ అనుబంధ సంస్థ అయిన ఇన్‌స్టామార్ట్‌లో 70 కోట్ల డాలర్ల(దాదాపు రూ.5,250 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు స్విగ్గీ పేర్కొంది. ప్రస్తుతం 18 నగరాల్లో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ సేవలు అందిస్తోంది. వారానికి 10 లక్షలకు పైగా ఆర్డర్లు నిర్వహిస్తున్నట్లు సంస్థ తెలిపింది. 2022 జనవరి కల్లా 15 నిమిషాల్లోనే నిత్యావసరాలు డెలివరీ చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది.జొమోటోకు చెందిన గ్రోఫర్స్‌తో పాటు, డుంజో వంటివి ఇలాంటి సేవలు అందిస్తుండగా.. వీటితో ఇన్‌స్టామార్ట్ పోటీ పడనుంది. ప్రస్తుతం ఇన్‌స్టామార్ట్ సేవలు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నంలలో అందుబాటులో ఉన్నాయి.