సుప్రియా లైఫ్ సైన్సస్ IPO నేడే
యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రిడెంట్స్ (API) సరఫరా చేసే సంస్థ, ఫార్మా తయారీ కంపెనీ అయిన సుప్రియా లైఫ్ సెన్సెస్ లిమిటెడ్ పబ్లిక్ ఆఫర్ ఇవాళ విడుదలైంది. ఈనెల 20న ముగుస్తుంది. దాదాపు 38 ఏపీఐలు తయారు చేసే ఈ సంస్థ రూ. 700 కోట్ల సమీకరణకు పబ్లిక్ ఆఫర్ చేస్తోంది. ఇందులో రూ. 200 కోట్లకు విలువైన కొత్త షేర్లను జారీ చేస్తోంది. రూ. 500 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు అమ్ముకుంటున్నారు. నిజానికి ఈ కంపెనీలో ప్రమోటర్ల గ్రూప్‌కు 99.98 శాతం వాటా ఉంది. ప్రమోటర్లు షేర్లు అమ్మినా కంపెనీలో వాటా స్వల్పంగా తగ్గుతుంది. రూ. 2 ముఖ విలువగల షేర్‌ను రూ.265- రూ. 274లకు ఆఫర్ చేస్తోంది. కనీసం 54 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు సొమ్ము రూ. 14,796. గరిష్ఠంగా 13 లాట్లకు దరకాస్తు చేయొచ్చు. డిసెంబర్ 27న కంపెనీ షేర్లు లిస్ట్ అవుతాయి. ప్రధాన షేర్ మార్కెట్ బ్రోకింగ్ సంస్థలు ఈ పబ్లిక్ ఆఫర్‌కు పాజిటివ్ రేటింగ్ ఇస్తున్నాయి. గరిష్ఠంగా రూ. 274లకు ఆఫర్ చేస్తున్న ఈ షేర్ అనధికార మార్కెట్లో రూ. 524 వద్ద లభిస్తోంది.