16,900పైన నిఫ్టి
ఆసియా మార్కెట్లకు భిన్నంగా నిఫ్టి ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమైంది. ఆరంభంలోనే 16900 స్థాయిని దాటి 16910ని తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 114 పాయింట్ల లాభంతో 16,885 వద్ద ట్రేడవుతోంది. సోనీ డీల్‌కు జీ ఎంటర్టైన్మెంట్ బోర్డు ఆమోదం తెలపడంతో… ఆ కంపెనీ షేర్ ఆరంభంలో నష్టాల్లో ఉన్నా…వెంటనే లాభాల్లో వచ్చింది. ఈ డీల్‌కు వాటాదారుల ఆమోదం పొందాల్సి ఉంది. ఇక మార్కెట్ విషయానికొస్తే బ్యాంక్ నిఫ్టితోపాటు మెటల్స్ను గట్టి మద్దతు లభించింది. డీ మార్ట్ దమానీ వాటా పెంచుకున్నారన్న వార్తతో ఇండియా సిమెంట్స్ షేర్ మరో ఏడు శాతం పెరిగింది. మిడ్ క్యాప్, బ్యాంక్ నిఫ్టితో పాటు ఇతర సూచీలు ఆకర్షణీయ లాభాలతో ఉన్నాయి. రాత్రి నాస్డాక్ 2.5 శాతం లాభంతో ముగిసినా… మన మార్కెట్లలో ఐటీ షేర్లలో ర్యాలీ అంతంత మాత్రమే ఉంది.