నిఫ్టి వ్యూహం… రెండు షేర్లు
వచ్చే వారం నిఫ్టికి 18,000 సాలిడ్ సపోర్ట్ లభించవచ్చు. ఎందుకంటే ఇక్కడ పుట్ రైటింగ్ చాలా ఎక్కువగా ఉంది. ఇక వచ్చేవారం నిఫ్టి ముందుకు సాగాలంలే 18300 -18350 స్థాయిని బ్రేక్ చేయాల్సి ఉంటుందని ప్రముఖ టెక్నికల్ అనలిస్ట్ ఆదిత్య అగర్వాల్ (ఎస్ సెక్యూరిటీస్) ఎకామిక్ టైమ్స్ పత్రికతో అన్నారు. ఈ స్థాయిని దాటితే నిఫ్టి 18500 నుంచి 18600 దాకా వెళ్ళే అవకాశముంది. నిఫ్టి గనుక అటువైపు వెళ్ళక వెనక్కి తిరిగితే 18100 లేదా 18000లకు చేరే అవకాశముందని ఆయన అంటున్నారు. ఆయన సోమవారానికి రెండు షేర్లను రెకమెండ్ చేశారు. ఒకటి బీపీసీఎల్. ప్రస్తుతం ఈ షేర్ ధర రూ. 398 కాగా… రూ. 388 స్టాప్‌లాస్‌తో రూ. 418 టార్గెట్ కోసం కొనుగోలు చేయొచ్చని ఆయన సలహా ఇచ్చారు. అలాగే జిందాల్ స్టీల్ షేర్‌ను రూ. 404 స్టాప్‌లాస్‌తో రూ. 445 టార్గెట్ కోసం కొనుగోలు చేయొచ్చని పేర్కొన్నారు. ఈ షేర్ ప్రస్తుతం రూ. 418 వద్ద ట్రేడవుతోంది.