ఇన్వెస్టర్లను భయపెడుతున్న పతనం
ఇప్పటి వరకు మార్కెట్ పతనానికి ఎన్నో కారణాలు చెప్పారు. ఇప్పటికే నాస్‌డాక్ మార్చి స్థాయి దిగువకు వచ్చేసింది. వడ్డీ రేట్లను మార్కెట్ డిస్కౌంట్ చేసిందన్నారు. మార్కెట్ ఇక పడదన్నారు. కాని అన్ని పతనం కావడం కాదు… ఇన్వెస్టర్లను భయపెట్టే స్థాయిలో పతనం ఉంటోంది. రోజూ పావు, అర శాతం పెరగడమే గగనంగా ఉండేది సూచీలు. కాని జెట్ స్పీడుతో సూచీలు పడుతున్నారు. మార్కెట్ పెరగడమంటే.. కొండెక్కడంలా ఉంది. అదే పడటమంటే.. కొండపై నుంచి దొర్లడంలా ఉంది… సూచీల పతనం చూస్తుంటే. నాస్‌డాక్ మూడు, నాలుగు శాతం పడటం మార్కెట్‌లో కామన్‌గా మారిపోతోంది. ఇవాళ వాల్‌స్ట్రీట్ అన్నీ పతనం కావడం విశేషం. ఈక్విటీ మార్కెట్లు, బాండ్లపై ఈల్డ్, డాలర్, క్రూడ్, బంగారం, వెండి.. అన్నీ పతనంవైపే ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ అయిదు శాతంపైగా పడింది. దీంతోడౌజోన్స్ ఒకటిన్నర శాతం పడింది. ఐటీతో పాటు టెక్ షేర్లు పడటంతో ఎస్ అండ్ పీ 500 సూచీ రెండున్నర శాతం పడింది. ఇక నాస్‌డాక్ ఏకంగా మూడున్నర శాతం నష్టంతో ట్రేడవుతోంది. వెండి రెండు శాతంపైగా క్షీణిస్తే…బంగారం కూడా ఒక శాతంపైగా నష్టంతో ట్రేడవుతోంది. ఇవాళ యూరో మార్కెట్లు కూడా భారీ నష్టాలతో ముగియడం విశేషం. యూరో స్టాక్స్ 50 సూచీ దాదాపు మూడు శాతం నష్టంతో ముగిసింది.